Friday, January 30, 2015

పుణ్య భూమి నా దేశం

పుణ్య భూమి నా దేశం 
(An Inconvenient Truth)
______________________________________________________
My sacred country 


రోగాలు ఉన్న చోట డాక్టర్లు, మందులు పుట్టుకొచ్చినట్లు, నా పవిత్ర భారత దేషంలో నీతి సూత్రాలు పుట్టుకొచ్చాయా? అనాది కాలంగా నీతులు బోధిస్తున్నా ఒక్కడూ కూడా మారినట్లు కనిపించడం లేదు ఎందుకు? రోజు రోజుకి దిగజారుడే కనిపిస్తుంది ఎందుకు? 


మత గ్రంధాలు, మత గురువులు, ప్రార్ధనా సంస్థలు, నీతి మరియు పురాన కాలక్షేపాలు, భక్తి చానళ్ళు, పరిగడుపున మోగే భక్తి సంగీతాలు హమ్మమ్మ ఎన్ని ఉన్నా, తరాలు గడిచినా, యుగాలు మారినా ఏమిటి బీభత్సం? ఎన్ని మందులు ఇచ్చినా తగ్గని జబ్బా మనది? అది పైకి చెప్పకుండా మా దగ్గర యిన్ని మందులు ఉన్నాయి, అన్ని మందులు ఉన్నాయి, ఇన్ని ఆస్పత్రులు ఉన్నాయి, అన్ని ఆస్పత్రులు ఉన్నాయి, మేము పొద్దున్న లేసి ఆస్పత్రిలోనే ఉంటాము, మాది ఎంత గొప్ప దేశమో తెలుసా? అని ఫీల్ అవుతున్నామా? జబ్బు తగ్గాక ఆస్పత్రితో  పని ఏమిటి, మందులతో పని ఏమిటి?    


ట్రాఫిక్ రూల్స్ పాటించే దేశాల్లో, వాటిని పాటించండి అహో అని మోత మోగించరు కదా? ఒక మాటగా చెప్తారు అంతే కదా, లేదా పిల్లలకు పాటాలుగా చెప్తారు. ఇక్కడ ఏమిటి స్వామీ వేల సంవత్సరాల నుండి అనంతంగా నీతులు బోదిస్తున్నా!అబ్బో ఇంకా చెప్పాల్సి వస్తుంది. 

  • అవినీతిలో ముందు స్థానం
  • ఆకలి చావులలో ముందు స్థానం, ఆత్మహత్యలలో ముందు స్థానం 
  • రోడ్లు మీద పషువుల కంటే ఘొరంగా వాహనాలు నడపటంలో ముందు స్థానం 
  • చెత్త వేయటంలో ముందు స్థానం
  • పరమ నీచాతి నీచంగా రాజకీయాలు నడపటంలో ముందు స్థానం
  • మనుష్యులు కులాలు, మతాలుగా విడిపోయి కొట్టుకోవటంలో ముందు స్థానం 

అబ్బో చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడు ఎంత పొడుగో నాకు తెలియదు కానీ, ఈ నికౄష్టాలకు అంతే ఉండదు. 

ఎన్ని ఆస్పత్రులు ఉన్నా, ఎన్ని మందులు మింగినా ఈ జబ్బు తగ్గదు ఏమిటి చెప్మా? 


        ******

One year Progress Report

అది ఇoకా కనపడ లేదు జనాలు మాత్రం "ప్రభుత్వం" తమ ఇళ్ళల్లోకి దూరి "కూర గిన్నెలు" వెతికి అరెస్టు చేస్తుందేమో అని భయపడుతున్నారు. ఆవుని తినవద్దు అని ఒకడు, కుక్కను తినవద్దు అని ఇంకొకడు. ఇదేమి న్యాయo? అంతరించి పోయే జంతువులు అని భావించి ప్రభుత్వం నిషేదించిన జంతువులు తప్ప అన్నింటిని తినవచ్చును. 

ఆవులు ఏమీ అంతరించి పొయే జంతువులు కావు కదా? సెకనుకి పది వేల ఆవులు పుడుతుంటే వాటిని ఏమి చెస్తారు? భూమి మొత్తం ఆవులతో నిండిపోతే మనిషి బ్రతికేది ఎలా? ఇప్పుడు వీది కుక్కలు మనుష్యులను కరిచినట్లు అప్పుడు ఆవులు మనుష్యులను పొడిస్తే ఎలా?

అప్పుడు గోమాతల దగ్గరికి వెళ్లి " ఇద్దరు వద్దు, ఒకరే ముద్దు" అని చెప్తారా? లేక "ఎద్దులకు గర్భ నిరోధకాలు తొడుగుతారా?" ఇదేమి విచిత్రం?

అనాదిగా మానవుడు మాంసాహారం తిన్నాడు. మాంసం సంపూర్ణ పోషక ఆహారం, కనీసం శ్రమ జీవులకు అయినా సరే. అరకిలో మాంసం తిని అడుగు దూరం కూడా నడవని వాడికి మాంసం అవసరం లేదు కానీ, శ్రమ జీవుల పరిస్థితి ఏమిటి? మాంసం తిని శ్రమ చేయకుండా ఉండి ఉంటే, ప్రస్తుత ప్రపంచాన్నీ నిర్మించింది ఎవరు? కోట్ల ఎకరాల అడవులు కొట్టింది ఎవరు? కొండలు పిండి చేసి రోడ్లు వేసింది ఎవరు? బావులు, చెరువులు తవ్వింది ఎవరు?

అసలు మాంసం తినకుండా మనిషి మనుగడ సాగించాడా? అది సాధ్యమేనా? అనాదిగా కుల మతాలకు అతీతంగా అందరు మాసం తిన్నవారే, లేత గోవుల మాంసాన్ని లొట్టలు వేసుకుంటూ తిన్నవారే అందరూ.   

కాల క్రమంలో శ్రమ చేయకుండా బ్రతక నేర్చిన కొన్న వర్గాల వారు "తిన్న మాంసం అరగక పొయే సరికి" కని పెట్టిందే "శాకాహార భోజనం", ఇందులో శ్రమ జీవులైన నిమ్న వర్గాలను కించ పరచటం కూడా ఉన్నది. ఆవులను పవిత్రం చేసి, పేదవారైన శ్రమ జీవులకు ఆహారం దొరక కుండా చేసిన కుట్ర కూడా ఉన్నది ఇందులో. 

అరక దున్నిన మనిషికి ఆకూ కూరలు తింటే సరిపోతుందా? ఈ నీతులు చెప్పే మనుష్యులు "పప్పన్నం తిని టైర్లు పంక్చరు చేయగలరా?" వీళ్ళు ఇచ్చే కూలీకి "ప్రోటీన్ సప్లిమెంట్లు" ఎక్కడ నుండి వస్తాయి?
        
ఆవు పవిత్రమే కానీ మనిషి ఇంకా పవిత్రం కదా? ఒకవేళ కాకపోయినా మా "ప్రవచన కర్తలు" చెప్పినట్లు, దీపాలు పెట్టి పాపాలు పోగొట్టుకున్నామ్. మందిని ముంచిన పాపాలు, మురికి నీళ్ళల్లో మునిగి కడిగి పారేసాం కదా? ఇప్పుడు భూమి మొత్తం ఆవులతో నిండిపోతే మా పొట్టలు నిండేదెలా?

"సంపూర్ణ మాంసా హారి అయిన" బుద్దుడు పుట్టిన పుణ్య భూమి ఇది. అయన ప్రవచించిన అహింస సిద్దాంతం తోటి మనిషిని హింసించ వద్దని మాత్రమే కదా?  
*****

ఫేస్ బుక్ లో నేను 

నా నిజ జీవితంలో ..... 
నా భార్య నా మాట వినదు 
నా భార్య మాట నేను అసలే వినను 
నా పిల్లలంటే నాకు ఇష్టమే కానీ వాళ్ళకి నేనంటే చులకన 
నా ఇంట్లో నా మాట ఎవడూ లెక్క చేయడు 
మా అన్నదమ్ములం కలిసి ఎన్నో సంవత్సరాలు అయిపోయాయి 
తల్లి తండ్రులను ఎప్పుడో మర్చిపోయాను 
నా స్నేహితులకు నాకు పడనే పడదు, ఒక్కోక్కడిది ఒక్కొక్క దారి 
పక్క ఇంటి వాడు ఎవడో నాకు తెలియదు 
ఎదురింటికి మాకు ఇరవై అడుగుల దూరం 
ఇక ఆఫీసులో......  
నా క్రింది వాళ్ళకి నన్ను చూస్తే అసహ్యం 
నా పై వాళ్ళకి నేనంటే ఎంతో చులకన 
నా తోటి వాళ్ళకు ఒకరంటే ఒకరికి పరమ అసూయ  
కానీ ఫేస్ బుక్ లో..... 
నా మాట  వేదాంతం 
నా పనికి రాని ప్రతీ పోస్టు ఒక అద్బుతం 
నా ప్రతీ అభిప్రాయం ఒక శాసనం
నా ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లైకు   

నా డొక్కు మొహం చంద్ర బింబం 
నా వంకర నడక సింహపు నడక 
నా నవ్వు మలయ మారుతం 
నా తుమ్ము జల ప్రళయం 
నా దగ్గు మేఘ ఘర్జన 
నా పి........ అణు విస్పోటనం 
నేనంటే అందరికి "లైకు" 
బాగా చదువు "కొన్నాక" ఉన్న మతి పోయింది నాకు 
అందుకే పేసు బుక్కంటే నాకు పరమ లైకు 
     
*****

ఉద్యమం 
అయిన దానికో ఉద్యమం 
కాని దానికో ఉద్యమం 
టైమ్ పాస్ కి మరో ఉద్యమం 
ఆలు మగల పంచాయతి పై అలుపెరగని ఉద్యమం
బహిరంగ ముద్దులకై  మహోద్యమం 
నర హంతకులను శిక్షిస్తే పుడుతుంది అసలైన ఉద్యమం
............కానీ 
అవినీతిపై ఉండదు ఏ ఉద్యమం 
అక్రమాలను అసలే అడగదు మా ఉద్యమం
దేశాన్ని దోచుకు తింటున్న ముందుకు కదలదు ఈ మహోద్యమం 
ఏ ఒక్క అవినీతి పరున్ని ఇంతవరకు నిలదీయలేదు మా ఉద్యమం
ఒకవేళ జరిగినా "సెటిలమెంట్లతో" ఆగిపోతుంది ఈ ఉద్యమం  
.....అందుకే, మాది పస లేని ఉద్యమం, పని లేని ఉద్యమం 
....అయినా, కలసి ఉండలేదు మా ఉద్యమం
.....అందుకే, ప్రతీ తలకి ఒక ఉద్యమం
.....కానీ, విడిగా చేయలేదు ఏ ఉద్యమం
......అందుకే, ఎల్లప్పుడూ కలిసి (ఉద్యమ JAC) కదులుతుంది ఈ ఉద్యమం  
ముతక బట్టలు కట్టి 
మెర్సిడెజ్ బెంజ్ లలో దూసుకు పోతుంది మా మహోద్యమం 


లక్షల కోట్ల అవినీతి జరిగినా, కోట్ల ఎకరాల అడవులు తరిగి పోయినా, కోట్ల మెట్రిక్ టన్నుల ఖనిజాలు దోచుకు పోయినా, వాతావరణం సర్వ    నాశనమం అయిపోయినా, నదులు, సముద్రాలు మురికి కూపాలు అయిపోయినా, అందుకు కారణమైన ఏ సంస్థను, వ్యక్తిని ప్రశ్నించని ఉద్యమ కారులని చూస్తున్న బాధతో......     

*****
వరుడు కావలెను


భర్త ఏ వ౦ట అడిగినా హోటల్ ను౦డి తెప్పి౦చగలిగిన మా చిట్టి తల్లికి
పని మనిష్యుల సహాయ౦తో ఇ౦టిని ఓ మోస్తరుగా 
సరిదిద్ద గలిగిన మా కన్న తల్లికి 
పెళ్ళయిన రె౦డు రోజుల్లో అత్తా మామలను 
భర్తకు దూర౦ చేయగలిగిన మా బుజ్జి కన్నకు 
అత్తా మామలను కొరకు వృద్దాశ్రమాల అడ్రసులన్నీ 
క౦ఠతా పట్టిన మా వరాల మూటకు 
మోడ్రన్ మహా లక్ష్మి లా౦టి మా బ౦గారు తల్లికి...

లక్షల జీత౦ తెచ్చే
కోట్ల ఆస్తి ఉన్న
తల్లి త౦డ్రులను అసలు ప్రేమి౦చని
ఇతర బ౦ధువులను అసహ్యి౦చుకునే
భార్యను అద్భుత౦గా ప్రేమి౦చగల  
అత్తా మామలుగా దైవ౦గా భావి౦చే

వరుడు భర్తగా కావాలెను..
ఇక.....కట్న కానుకలకు అ౦తే లేదు
తాళి కట్టే౦త వరకు మర్యాదలకు లిమిటే ఉ౦డదు..
ఇట్లు...
మర్యాద రామన్న

*****

న్యూస్ పేపర్ 
చలి కాల౦ చలి వార్తలు
ఎ౦డా కాల౦ ఎ౦డల వార్తలు
వానా కాల౦ వానల వార్తలు
అవతలి పార్టీ తప్పులు
తమ పార్టీ గొప్పలు
"సెటిల్" చెయ్యని నేరాలు
రాయక తప్పని ఘోరాలు
డబ్బులు ముట్టిన కార్యక్రమాల వివరాలు
డౌన్ లోడ్ చేసిన విషయాలు
కాపీ కొట్టిన స౦గతులు 
పావు సగ౦ వాణిజ్య వార్తలు
అర సగ౦ వాణిజ్య ప్రకటనలు..

ర౦డి బాబు ర౦డి..వేడి వేడి వార్తలు 
సబ్సిడీ పొ౦దిన న్యూస్ ప్రి౦టుతో, సబ్సిడీ లేని ధరలకే  

******
నేటి ఓటరు 

పాపాలు చేసినా, పీపాడు తాగినా
మ౦దిని ము౦చినా, దేశాన్ని దోచినా
కొ౦డలు కరిగి౦చినా, బ౦డలెత్తుకు పోయినా
ఘనులు దోచినా, ఇసుక తిన్నా
ల౦చాలు మరిగినా, మ౦చాలు పరిచినా
నువ్వు పది కార్ల కాన్వాయిలో వచ్చినా 
లేక పడవ౦త కారులో వచ్చినా చాలు నాయకా
అ౦దుకు౦టావు ఎప్పటికీ మా నీరాజనాలు, జయ జయ నాదాలు 

******